భారత్‌లో

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది: మంత్రి లోకేశ్

Published on: 22-10-2025

మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వేగా మారిందని ఆయన అన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తావించారు. గత 16 నెలల్లో ఏపీకి రూ. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, అందులో విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కూడా ఉందని వివరించారు. ఏపీలో పారిశ్రామికవేత్తల కోసం సరళతర పాలసీలు అమలు చేస్తున్నామన్నారు. నవంబర్‌లో విశాఖలో నిర్వహించే పార్టనర్‌షిప్ సమ్మిట్-2025కు హాజరు కావాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను లోకేశ్ కోరారు.

Sponsored