గుంటూరు జిల్లా పొన్నూరు శివారులోని ఓ వరిపొలంలో విషాదం చోటుచేసుకుంది. కూలీలుగా పనిచేస్తున్న మహిళలపై పిడుగు పడటం వల్ల ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మరియమ్మ (45), **షేక్ ముజీదా (45)**గా గుర్తించారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పొన్నూరు చివరిలోని ఈతకుండారెడ్డి వద్దగల పొలంలో జరిగింది.