ఏపీలోని

ఏపీలోని వర్సిటీలతో కలిసి పనిచేయండి.. ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్

Published on: 22-10-2025

మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పబ్లిక్ పాలసీ, సుస్థిరత, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం చర్చించారు. ఆంధ్రప్రదేశ్-గ్రిఫిత్ విశ్వవిద్యాలయం మధ్య భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, సిలబస్ రూపకల్పన కోసం ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పునరుత్పాదక శక్తి, ఉపాధి, నీటి నిర్వహణ రంగాల్లో ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను ప్రారంభించాలని ఆయన సూచించారు.

Sponsored