సీఎం

సీఎం రేవంత్‌రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ

Published on: 21-10-2025

నగరంలో చర్చనీయాంశమైన పరిణామాల నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ దంపతులు సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారిని తీసుకెళ్లారు. కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే. మేడారం టెండర్ల పంచాయితీ, అలాగే ఓఎస్డీ సుమంత్ తొలగింపు వంటి పరిణామాలు, సురేఖ నివాసానికి పోలీసులు వెళ్లడం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు సీఎంను కలిశారు.

Sponsored