గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, రాష్ట్రం ప్రగతి పధంలో ప్రకాశించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యావరణ హితంగా వేడుకలు చేసుకోవాలని కోరారు. దీపావళి స్ఫూర్తితో ప్రజాస్వామ్య యుద్ధంలో 'నరకాసురుల' వంటి వారిని ప్రజలంతా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.