'రంగం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు అజ్మల్ అమీర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను కొందరు మహిళలకు అసభ్యకర సందేశాలు పంపారంటూ కొన్ని స్క్రీన్‌షాట్లు, ఆడియో క్లిప్‌లు నెట్టింట వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన అజ్మల్, అవి 'ఫేక్ సృష్టి' అని స్పష్టం చేశారు. "ఇలాంటి చర్యలు నా సినిమా కెరీర్‌కు ఏమీ చేయలేవు. కోలీవుడ్, టాలీవుడ్‌లలో నటుడిగా నన్ను నేను నిరూపించుకున్నాను. నా ఇమేజ్‌ని కాపాడుకునేందుకు మేనేజర్‌గానీ, పీఆర్‌గానీ లేరు," అని తెలిపారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో భాగంగా దుబాయ్‌లో ఉన్నానని చెప్పారు.