డెలివర్-టెల్ అవీవ్ మధ్య మరణ మృదంగాన్ని సృష్టించిన పశ్చిమసియాలో శాంతి పరిణామాలు మొదలయ్యాయి. ఇటీవల నెత్తురుటేరులు పారిన గాజా, ఇజ్రాయెల్ వైపు ఆశలు చిగురిస్తున్నాయి. ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రతిపాదనలో భాగంగా హమాస్ అదుపులో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను సోమవారం రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. రెడ్‌క్రాస్ వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 1900 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఈ ఘటనను పశ్చిమసియాలో చారిత్రక నవోదయంగా ట్రంప్ అభివర్ణించారు. గాజా యుద్ధం ముగిసిందని అంటున్నారు.