బిహార్

బిహార్ రంజీ వైస్ కెప్టెన్‌గా సూర్యవంశీ

Published on: 14-10-2025

యువ బ్యాటింగ్ సంచలనం, పద్నాలుగేళ్ల యశస్వీ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. రానున్న రంజీ ట్రోఫీలో బిహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని బిహార్ ఈసారి 'ప్లేట్ లీగ్'లో ఆడనుంది. సూర్యవంశీ 12 ఏళ్లకే రంజీలో అరంగేట్రం చేసి, ఆ తర్వాత 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడి రికార్డు సృష్టించాడు. టీ20లలో చిన్న వయసులో ఆ ఘనత సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే, వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచకప్‌లో ఆడనున్నందున, ఈసారి రంజీ సీజన్ వైస్ కెప్టెన్‌గా పూర్తిగా అందుబాటులో ఉండే అవకాశం లేదు.

Sponsored