గాజా యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై మొదట్లో అనుమానాలున్నా, ఆ తరువాత హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాలు విరమణ ఒప్పందం కుదిరింది. ట్రంప్ జోక్యం లేకుండానే రెండు వర్గాలు సయోధ్య కుదుర్చుకున్నాయని అందరూ భావిస్తున్నప్పటికీ, దీని వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ అని తెలుస్తోంది. ముఖ్యంగా, యుద్ధంలో ఆయుధాలను త్యజించే అంశంపై హమాస్ స్పష్టతనివ్వకపోవడం, గాజాపై నియంత్రణ వదులుకోబోమని ప్రకటించకపోవడం వంటి అంశాలు అనుమానాలను మరింత పెంచాయి.