హిందీ ప్రేక్షకులను అలరించడానికి మరో కొత్త జోడీ తెరపైకి రాబోతోంది. వారు షర్వరి వాఘ్, మోహంగ్ రెనా. వీరిద్దరూ కలిసి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన చిత్రంలో నటిస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ అపాట్ ఎంటర్‌టైన్‌మెంట్ 'కొత్త ప్రయాణం మొదలైంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతమందిస్తున్నారని తెలిపారు. 1940 కాలంలో పంజాబ్ నేపధ్యంలో ఉండే ఈ చిత్రం, విభజన తర్వాత జీవితాలు ఛిన్నాభిన్నమైన యువ జంట కథను చూపిస్తుందని సమాచారం. ఈ సినిమాలో దిలీప్ దోసాంజ్, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.