అభివృద్ధిని

అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న జగన్

Published on: 11-10-2025

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. గుజరాత్‌లో 10 ఏళ్లుగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్వహిస్తున్నారని, ఉత్తరప్రదేశ్‌లో కూడా దీనిని అమలు చేస్తున్నారని తెలిపారు. అనకాపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి, వైద్య సీట్ల కోసం పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలని చూస్తోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని, పరిశ్రమలు వస్తున్నా పారిశ్రామిక వేత్తలను భయపెడుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎంపీ ఆరోపించారు.

Sponsored