పట్టణ

పట్టణ స్థానిక సంస్థలకు నిధుల పండుగ

Published on: 11-10-2025

నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్‌బీలకు) ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.1,400 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభం కానున్నాయి. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా 157 యూఎల్‌బీలు నిధులు లేక సతమతమవుతున్నాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి పనులు బడ్జెట్‌లో ముడిపడి ఉన్నా, బిల్లులు చెల్లించలేక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్లు మంజూరు చేసింది. దీనికి తోడు త్వరలో మరో రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలని, టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.2,500 కోట్లు అదనంగా సమీకరించాలని యోచిస్తోంది.

Sponsored