ఎమ్మెల్యే

ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సీఎం పరామర్శ

Published on: 11-10-2025

నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన దశదిన కర్మకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి హాజరయ్యారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించి, భూపతిరెడ్డి కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. అంతకు ముందు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎంను కలిసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించి, పోలీసులు అడ్డుకోవడంతో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఎంను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు తమ జిల్లా సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు.

Sponsored