హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మనుషులు-జంతువుల మధ్య సంఘర్షణ తగ్గించడంలో కృషి చేసినందుకు గాను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈ సంస్థను ఎంపిక చేసింది. డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా సొసైటీ ప్రతినిధి హరీష్ పాటిమా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. పోచారం అభయారణ్యం పరిసర ప్రాంతాలలో మనుషులు-చిరుతపులుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 120 బృందాలను పరిశీలించిన తర్వాత తమ బృందాన్ని ఎంపిక చేశారని సొసైటీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ సిద్ధిఖీ తెలిపారు.