రైడెన్‌కు

రైడెన్‌కు రైట్ రైట్

Published on: 11-10-2025

రాష్ట్ర సాఫ్ట్‌వేర్ రంగ గతిని మార్చే కీలక నిర్ణయానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేసే దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు ఆమోదం తెలిపింది. దీంతో విశాఖ నగరం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందనుంది. మొత్తంగా రూ.1,27,181 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 78,771 మంది ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలను ఆమోదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశ వివరాలను మంత్రి కొల్లు పార్థసారథి వివరించారు.

Sponsored