వైకాపా అధ్యక్షుడు జగన్ చేస్తున్నవి వీకెండ్ పాలిటిక్స్ అని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పర్యటనల పేరుతో జగన్ మాయాజాలం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో తమ ఇష్టమొచ్చిన పనులను అడ్డుకుంటున్నారని గంటా ఆరోపించారు. జగన్ పాదయాత్రకు తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సత్తెనపల్లి, గుంటూరు, మిర్చియార్డు, నెల్లూరు పర్యటనలకు పోలీసులు అనుమతి ఇచ్చారని గుర్తుచేశారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా కుట్ర పాలిటిక్స్ చేస్తోందని, ఇది ఆపకపోతే చూస్తూ ఊరుకోబోమని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.