లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో భాగంగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి సంబంధించిన సెలబ్రిటీల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకలకల్ సహా ఎనిమిది మంది ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కేరళ, చెన్నైలలోని మొత్తం 17 ప్రాంతాలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే దుల్కర్, పృథ్వీరాజ్‌ల ఇళ్లలో కస్టమ్స్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు.