'చిన్న'

'చిన్న' జట్లతో 'చిన్న' వేదికల్లోనే టెస్టులు నిర్వహిస్తే బెటర్: మాజీ క్రికెటర్

Published on: 08-10-2025

పెద్ద జట్ల మధ్య మ్యాచ్‌లకే అభిమానుల ఆదరణ పెరిగింది. వెస్టిండీస్‌తో భారత్ ఆడిన తొలి టెస్టుకు అదే రుజువు. అహ్మదాబాద్‌లోని 1.32 లక్షల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియంలో రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. కనీసం పది వేల మంది ప్రేక్షకులు కూడా రాలేదు. దీంతో స్టేడియం అంతా ఖాళీగా కనిపించింది. ఈ నేపథ్యంలో, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఒక సూచన చేశారు. చిన్న జట్లతో జరిగే టెస్టులను చిన్న వేదికల్లోనే (Small Venues) నిర్వహిస్తే అభిమానుల ఆసక్తి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Sponsored