అమెరికా

అమెరికా మరో నిర్ణయం.. పాక్‌కు అత్యాధునిక క్షిపణులు

Published on: 08-10-2025

NRI

అమెరికా-పాకిస్తాన్ బంధం రోజురోజుకూ బలపడుతోంది. పాక్‌కు అత్యాధునిక క్షిపణులను (మిస్సైల్స్‌ను) అందించనున్నట్లు తాజా ఆదేశంలో వెల్లడించింది. దీనిలో భాగంగా, గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్ (AMRAAM) ను ఇవ్వనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ (DoW) ప్రకటించింది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డీల్‌లో AIM-120C8 మరియు D3 వేరియంట్లు ఉన్నాయి, ఇది పాక్ వైమానిక దళం (PAF) యొక్క F-16 జెట్‌లకు అనుకూలంగా ఉంటుంది.

Sponsored