అనంతపురం జిల్లా, ఆత్మకూరుకు చెందిన రైతు గోపాల్‌రెడ్డి తన ఎద్దుకు ఇచ్చిన ప్రత్యేక శిక్షణ ఇది. ఎద్దు కళ్లకు గంతలు కట్టి, ములుకర్ర ఉపయోగించకుండా కేవలం తాడు సాయంతోనే పొలంలో విత్తనం వేశారు. గోపాల్‌రెడ్డి ఎద్దుకు ఆదేశాలు ఇవ్వగా, అది ఆయనతో చక్కగా సమన్వయం చేసుకుని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోగా విత్తనం వేసే పని పూర్తి చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. విత్తనం పూర్తయిన తర్వాత రైతు, ఎద్దును ఆత్మకూరు ప్రధాన వీధుల్లో ఊరేగించారు.