శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు తప్పక చూడవలసిన చారిత్రక ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ ఆలయాన్ని, దాని పక్కనే ఉన్న ధ్యాన మందిరాన్ని ఇక్కడ చూడవచ్చు. శివాజీ రాజసాన్ని ప్రతిబింబించేలా ఈ స్ఫూర్తి కేంద్రంలో భారీ బురుజులు, కోట, విగ్రహాలు వంటివి ఉన్నాయి. శివాజీ 1677లో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, ఆలయానికి ఉత్తరం వైపున ధ్యానం చేశారు. ఆయన ఆధ్యాత్మిక కోణాన్ని ఈ మందిరం ఆవిష్కరిస్తుంది. ఈ స్ఫూర్తి మందిరాన్ని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు.