అమెరికాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణుడు, ఫోర్స్ మ్యాగజైన్ సంపాదకుడు ప్రదీప్ సాహ్ని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా మరింత సమతుల్య విదేశాంగ విధానాన్ని అనుసరించాలని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జాత్యహంకారం పెరుగుతోందని, అదే సమయంలో ప్రపంచ దక్షిణ భాగంలో స్థిరత్వం పెరగడం సానుకూలమని చెప్పారు. హైదరాబాద్‌లోని మదాపూర్ శిల్పకళా వేదికలో గురువారం జరిగిన 'మంధన్ సంవాద్-2025' వార్షిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సామాజిక వెనుకబాటుతనం, కుల వివక్ష సమస్యలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయని పబ్లిక్ పాలసీ నిపుణుడు రాజన్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.