ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి విద్యార్థులను మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దసరా నాటికి రూ. 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పి, ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు దీపావళి నాటికి రూ. 1,200 కోట్లు ఇస్తామని ప్రభుత్వం తాజాగా చెబుతోందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లకు పైగా ఫీజు బకాయిలు పెట్టాయని మండిపడ్డారు. ప్రైవేటు కాలేజీలు ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా, బకాయిలు విడుదల చేయకపోవడం దారుణం అన్నారు. ఇలాగే మాట మారుస్తూ పోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.