గాజాలో యుద్ధ ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌కు హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా ఈ ప్రణాళికను అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం, 72 గంటల్లో బందీలను విడుదల చేయడానికి తాము సిద్ధమని హమాస్ వెల్లడించింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ కూడా గాజా నుంచి బలగాలను దశలవారీగా ఉపసంహరించుకోవాలి. ఇజ్రాయెల్‌పై భవిష్యత్తులో ముప్పు ఉండకుండా హమాస్ నిరాయుధీకరణ చెందాలని, ఆ తరువాతే శాశ్వత పరిష్కారం ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఒప్పందం విజయవంతం కాకుంటే, ముగింపు చాలా విషాదంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.