ట్రంప్

ట్రంప్ హెచ్1బీ వీసా నిర్ణయంతో అమెరికా కంపెనీలపై రూ.1.23 లక్షల కోట్ల భారం

Published on: 22-09-2025

NRI

అమెరికాలో హెచ్1బీ వీసాలపై కొత్త భారం పడబోతోందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఇకపై టెక్ కంపెనీలు ప్రతి సంవత్సరం దాదాపు 14 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి రావచ్చని అంచనా. వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం సంస్థలకు మోయలేని భారమని పేర్కొన్నారు. ఫిబ్రవరి లాటరీలో రానున్న కొత్త దరఖాస్తులకు ఇది వర్తించనుంది. అమెరికన్లను నియమించేందుకు ఒత్తిడి చేయడమే ట్రంప్ లక్ష్యమని తెలుస్తోంది. గతేడాది 141,000 హెచ్1బీ వీసాలు జారీ చేశారు. స్టార్టప్ సంస్థలకు ఈ నిర్ణయం తీవ్ర దెబ్బ అవుతుందని వై కాంబినేటర్ సీఈఓ ఆందోళన వ్యక్తం చేశారు.

Sponsored