విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది. ఇక రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ జనార్ధన్’ అక్టోబర్ నుంచి సెట్స్‌పైకి రానుంది. ఇందులో ప్రతినాయకుడిగా సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనువిందు చేయనున్నారని సమాచారం. ఆయన లుక్ శక్తివంతంగా, కొత్తగా ఉండబోతుందట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో రాజకీయ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విజయ్ సరసన కీర్తి సురేశ్ నటించనుండటం సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది