తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి సాలపట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందు అంకురార్పణను మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, పుట్ట మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నవధాన్యాలు ఆరోపించే క్రతువును శాస్త్రోక్తంగా చేపడతారు. బుధవారం సాయంత్రం 5:43 నుంచి 6 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అవసరమైన దర్బదాప తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి తీసుకువస్తారు. ఈ విధంగా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.