స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ నుంచి బయలుదేరుతుండగా, లాబీలో మంత్రి నారా లోకేశ్ ఆయనకు తారసపడ్డారు. అయ్యన్న వద్దని వారిస్తుండగా, లోకేశ్ దగ్గరుండి కారెక్కించి గౌరవంగా సాగనంపారు. ఇదిలా ఉండగా, టిజ్కో ఇళ్లపై లఘు చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎక్కువ సేపు మాట్లాడారు. విరమించాలని స్పీకర్ బెల్ కొట్టినా ఆయన కొనసాగించారు. దీంతో సభాపతి అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేస్తూ, సీనియర్లు ఇలా మాట్లాడితే ఎలా అని తీవ్రంగా స్పందించారు. సభలో ఈ సంఘటన చర్చనీయాంశమైంది.దీంతో కొంతసేపు సభలో హాస్యభరిత వాతావరణం నెలకొనగా, సభ్యుల మధ్య చర్చలు జోరందుకున్నాయి. ఆ తర్వాత వ్యవహారాలు సద్దుమణిగి సాధారణ కార్యక్రమాలు కొనసాగాయి.