హైదరాబాద్‌లో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఎలైన్మెంట్ వల్ల నష్టపోయిన రైతుల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను మోసం చేశారని విమర్శించారు. రాజ్యసభ, అసెంబ్లీలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుతుందని తెలిపారు. రైతులు ఐకమత్యం ప్రదర్శించి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని సూచించారు. శాస్త్రీయ ఎలైన్మెంట్ జరిగే వరకు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.