కొలంబోలో జరుగుతున్న అండర్-17 ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. ఉత్కంఠభరిత పోరులో భారత్ 3-2తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించింది. 31వ నిమిషంలో గాంగ్జే గోల్‌తో భారత్ ఆధిక్యం సాధించగా, పాక్ ఆటగాడు అబ్దుల్లా పెనాల్టీ ద్వారా సమం చేశాడు. భారత్ తరఫున గన్జబా, పాక్ తరఫున హంజా గోల్స్ చేయడంతో స్కోరు 2-2గా నిలిచింది. 73వ నిమిషంలో రెహాన్ అహ్మద్ గోల్ భారత్‌కు విజయాన్ని అందించింది. భారత్, పాక్ ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించాయి. అబ్దుల్లా గోల్ తర్వాత చేసిన టీ తాగుతున్నట్లైన సంబరం సోషల్ మీడియాలో విమర్శలు రేపింది.