భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యతో స్వేచ్ఛ పొందింది. నిజాం భారత విలీనాన్ని తిరస్కరించగా, సర్దార్ పటేల్ నేతృత్వంలో ఐదు రోజుల సైనిక చర్యతో సంస్థానం భారతంలో కలిసింది. ఈ సంఘటన భారత సమగ్రతలో కీలక మైలురాయిగా నిలిచింది.