ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏడు విమానాశ్రయాలకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపింది. ఈ మేరకు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రతిపాదించిన భూముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా పంపాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) జిల్లా అధికారులను కోరింది. కొత్తపట్నం మండలంలో విమానాశ్రయం కోసం మొదటి దశలో 798 ఎకరాలు, రెండో దశలో 300 ఎకరాలు, మొత్తం 1,098 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించారు.