ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు నుంచి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. రూ.10 లక్షల లోపు భూములకు రూ.100, దానికిపైగా రూ.1,000 రుసుముతో గ్రామ సచివాలయాల్లో నమోదు చేయవచ్చు. రెవెన్యూ శాఖ సంస్కరణలతో ఫిర్యాదుల పరిష్కారం వేగవంతమవుతుందని ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. భూహక్కుల సమస్యలు 70% వరకు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.