ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు అద్భుతమైన అవకాన్ని కల్పించింది.. రూ. లక్ష, రూ.75వేల, రూ.50వేలు గెలుచుకోవచ్చు. ' ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 ' పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. "వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్ 2047"లో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్లాన్ చేశారు. యువజన సర్వీసుల శాఖ ఈ డిజిటల్ మారథాన్‌ను మొదలుపెట్టింది. యువతలో సామాజిక స్పృహ కలిగించే వీడియోలు, కుటుంబ విలువలు, బంధాల గురించి.. ఫిట్‌నెస్ ప్రాముఖ్యత, AI వంటి సాంకేతిక మార్పులకు ప్రజలను సిద్ధం చేసేలా ఈ కార్యక్రమ ఉద్దేశం. 'ఆంధ్ర యువ సంకల్ప్ 2K25' ద్వారా యువత తమ ఆలోచనలను వీడియోల రూపంలో తెలియజేయవచ్చు. కుటుంబ విలువలు, ఫిట్‌నెస్‌తో పాటు సాంకేతికత గురించి కూడా చెప్పవచ్చు.
యువతకు బంపరాఫర్.. రూ.లక్ష, రూ.75వేల, రూ.50వేలు ఇస్తారు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు
Published on: 17-09-2025