ఏపీలో

ఏపీలో అక్కడ కొత్తగా బస్ టెర్మినల్.. 13 ఎకరాల్లో.. బస్ బే, హెలిప్యాడ్, మల్టీప్లెక్స్‌లు.. రూపురేఖలే మారిపోతాయ్..

Published on: 15-09-2025

రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుకొండల వాడి పాదాల చెంత కొలువై ఉన్న తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో బస్ స్టేషన్ (బస్ టెర్మినల్) నిర్మించాలని నిర్ణయించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రాను రానూ పెరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Sponsored