తిరుమలలో

తిరుమలలో ఇకపై వీరిని ఉండనివ్వరు.. పోలీసులు, టీటీడీ స్పెషల్ డ్రైవ్.. అందర్నీ తరలించారు

Published on: 15-09-2025

తిరుమలలో పోలీసులు, టీటీడీ కలిసి మరోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ నెలలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. ఈ క్రమంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి యాచకులు, అనధికార వ్యాపారులను తరలిచేందుకు టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో) మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్, తిరుమల పోలీసులు రంగంలోకి దిగారు. వీరంతా కలిసి సమన్వయంతో సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Sponsored