తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది.. చంద్రగిరి, పాకాల మండలాల సరిహద్దుల్లో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. పనపాకం అడవిలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలను పశువుల కాపర్లు గుర్తించారు. ఆదివారం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. మరొకటి వస్త్రంతో కప్పి ఉంది. ఆ ప్రాంతంలో రెండు గోతులు కూడా ఉన్నాయి.. వాటిలో పిల్లల మృతదేహాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గుంతలు తవ్వడానికి ఉపయోగించిన పార కూడా అక్కడ లభ్యమైంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.