ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యాశాఖ మంత్రి తనయుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. ఏకంగా వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. చెస్‌లో 175 కష్టమైన పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.. మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఈ వేడుకలో పాల్గొన్నారు. నారా దేవాన్ష్ గతేడాది '5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్' పుస్తకంలోని 175 కఠినమైన చెక్‌మేట్ పజిల్స్‌ను చాలా త్వరగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
నారా దేవాన్ష్ మరో ఘనత.. ఏకంగా వరల్డ్ రికార్డ్ సొంతం.. ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా
Published on: 15-09-2025