బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ 'కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏడాదిలో 3 సినిమాలతో వచ్చేవాడు గొప్పోడా? మూడేళ్లకు ఒకటి చేసేవాడు గొప్పోడా?: బెల్లంకొండ
Published on: 13-09-2025