బిగ్‌బాస్

బిగ్‌బాస్ బజ్‌కు హోస్ట్‌గా శివన్న.. 'బటర్‌ఫ్లై ఎఫెక్ట్' ప్రోమో రిలీజ్.. ఎలిమినేషన్ రోజునే ఎగ్జిట్ ఇంటర్వ్యూ..

Published on: 13-09-2025

కింగ్ అక్కినేని నాగార్జున హోస్టింగ్ లో 'బిగ్‌ బాస్' తెలుగు సీజన్‌-9 రియాల్టీ షో ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో 9 మంది సెలబ్రిటీలు ఉంటే, 6 మంది కామనర్స్ ఉన్నారు. ప్రారంభంలో కాస్త చప్పగా సాగిన ఈ షో.. ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య పోరు మొదలైంది. ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'బిగ్‌బాస్ బజ్' ప్రోమోని రిలీజ్ చేశారు.

Sponsored