ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఇచ్చే పెన్షన్ నుంచి కమ్యుటేషన్ భాగాన్ని 15 ఏళ్లలో రికవరీ చేయాలనే నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో ఈ నోటీసులు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ బి.అప్పారావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించడంతో స్పందించింది.