ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని సుదీర్ఘమైన తీర ప్రాంతం, పలు పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి సౌందర్యాలను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, చింతపల్లి, లంబసింగి ప్రాంతాలను స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాలను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు.
ఆ ప్రాంతాల దశ తిరిగినట్లే.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి..
Published on: 13-09-2025