చేనేతలకు

చేనేతలకు తీపికబురు.. అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి.

Published on: 13-09-2025

చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నేతన్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత కార్మికుల కోఆపరేటివ్‌ సొసైటీ (ఆప్కో) బకాయిలు పడిన డబ్బుల చెల్లింపులు ప్రారంభించింది. మొదటి విడతగా రూ.2 కోట్లకు పైగా బకాయిలను చెల్లించారు. 7 డివిజన్లలోని 84 సొసైటీల ఖాతాల్లో బకాయిల సొమ్ము జత చేసినట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే మిగిలిన బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు. ఆప్కో ద్వారా చేనేతలకు పడిన బకాయిలలో 20 శాతం మేరకు చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు కోట్లకు పైగా బకాయిల డబ్బులు 84 సొసైటీలకు చెల్లించారు. త్వరలోనే మిగతా వాటికి కూడా చెల్లిస్తామని మంత్రి వివరించారు.

Sponsored