ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరో మూడు రోజులు ఇంతే.. రేపు ఈ జిల్లాల్లో భారీ వానలు.. పిడుగులు కూడా పడే ఛాన్స్!
Published on: 13-09-2025