ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇకపై ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ తీసుకుని, ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఒకరి బదులు మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు.. అప్పుడు పని చేయలేరు, డబ్బులు ఇవ్వరు. అక్టోబరు 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మొదటగా ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాలను ఎంపిక చేస్తారు
ఏపీ ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే, లేకపోతే డబ్బులు కూడా ఇవ్వరు
Published on: 13-09-2025