బంగాళాఖాతంలో

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

Published on: 13-09-2025

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు నేడు నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, వికారాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Sponsored