తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు, చెరువులు నిండిపోయాయి. చాలా ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోనూ కుంభవృష్టి వానలు పడ్డాయి. దీంతో హైదరాబాద్ జంట జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రిజర్వాయర్ల నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న మూసీ నది లోకి విడుదల చేస్తున్నారు. దీంతో నగరంలో మూసీ నది ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలోనే మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ప్రమాదకరమైన రీతిలో ప్రవహిస్తోంది.
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. ఆ బ్రిడ్జిని మూసివేసిన అధికారులు, కారణం ఏంటంటే?
Published on: 13-09-2025