తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిపై తుది నిర్ణయం స్పీకర్‌కే అప్పగించింది. ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది.. సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే రాజకీయంగా మాత్రం.. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది కదా అంటూ హస్తం పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.
రాహుల్ గాంధీ 'ఓట్ల చోరీ'కి కౌంటర్‌గా కేటీఆర్ 'ఎమ్మెల్యే చోరీ'.. వీళ్లను గుర్తుపట్టగలరా అంటూ సెటైర్లు
Published on: 13-09-2025