హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ నగరం చుట్టూ మూడు కొత్త భారీ రైల్వే టెర్మినల్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దేశంలో ఇతర ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా మాదిరిగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను శివారు ప్రాంతాలకే పరిమితం చేయాలని ఈ ప్రణాళిక లక్ష్యం. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ఉన్న అధిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినళ్లు.. ఈ ప్రాంతాల్లోనే, భూముల ధరలకు రెక్కలు
Published on: 13-09-2025