చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. అందుకే ఎక్కడ ఈ మ్యాచ్ జరిగినా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు అవుతాయి. తరాలు మారినా.. ఈ మ్యాచుకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో భారత్, పాక్ కేవలం ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ద్వారా నిర్వాహకులు పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తారు.
ఇంకా అమ్ముడుపోని భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు.. ఫ్యాన్స్‌లో క్రేజ్ తగ్గిందా..!
Published on: 12-09-2025